మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్, కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన సినిమా "గోల్డ్". 'ప్రేమమ్' ఫేమ్ అల్ఫోన్స్ పుత్రేన్ ఆ సినిమా తదుపరి సుదీర్ఘ విరామం తీసుకుని డైరెక్ట్ చేసిన సినిమా ఇదే. ఈ సినిమాకు రాజేష్ మురుగేశన్ సంగీతం అందిస్తున్నారు. పృథ్విరాజ్ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.
ప్రేమమ్ రేంజ్ హిట్ కాకున్నా కనీసం ప్రేక్షకుల చేత ఓకే అని కూడా అనిపించుకోలేకపోయింది ఈ సినిమా. దీంతో సినిమా విడుదలైన కొన్ని రోజుల వ్యవధిలోనే డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 29 నుండి గోల్డ్ డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తుంది. ధియేటర్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిన ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa