దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం నార్త్ లో అందరికీ పరిచయమే. స్టార్ కిడ్ గా ఇటు తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా తెలుసనే చెప్పాలి. అటు సినిమాలతో పాటు ఇటు పలు ఈవెంట్లకూ హాజరవుతూ సందడి చేస్తోంది. పార్టీలు, స్పెషల్ ఈవెంట్లు, ఫంక్షన్లకు వెళ్తూ కనువిందు చేస్తోంది. అయితే, నిన్న భారత దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ నిశ్చితార్థం రాధికా మర్చెంట్ తో జరిగిన విషయం తెలిసిందే.
ఈ వేడుకకు దేశంలోని బిగ్ షాట్స్ హాజరయ్యారు. ఈ క్రమంలో సినీ తారలు కూడా సందడి చేశారు. రన్వీర్ సింగ్, రన్బీర్ కపూర్, సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. ఇదే వేడుకకు అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హాజరై సందడి చేసింది. అయితే వేడుకలో జాన్వీ తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా తో కలిసి కనిపించింది. అనంత్ అంబానీ నిశ్చితార్థ వేడుకకు వారిద్దరూ హాజరవడం విశేషం. ఈ సందర్భంగా పార్టీ నుంచి బయటికి వచ్చిన కొన్ని వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు నిశ్చితార్థ వేడుకలో లేత బేబీ పింక్ శారీలో ఆకట్టుకుంది. ట్రాన్ఫరెంట్ చీరలో అందాలను ఆరబోసింది. ట్రెడిషనల్ లుక్ లో మతులు పోగొట్టింది.
Actress #jahnvikapoor reaches Antilia. Mukesh Ambani's son #anantambani gets engaged to #radhikamerchant. Their engagement was held at the Shrinathji Temple in Rajasthan. pic.twitter.com/f1SnCjqFgr
— Sharmila Maiti (@sharmilamaiti) December 29, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa