ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ‘ఎన్టీఆర్ 31’ సినిమా చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికర వార్త బయటకి వచ్చింది. ఈ చిత్రంలో కీలక పాత్రలో అమీర్ ఖాన్ నటించే అవకాశం ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి. విలన్ రోల్ కోసం.. ప్రశాంత్ నీల్ అమీర్ ఖాన్ ను సంప్రదించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.