ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్రాంచైజీగా రాబోతున్న SSMB29 - రచయిత విజయేంద్రప్రసాద్

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 30, 2022, 11:38 PM

ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా ఎస్ ఎస్ రాజమౌళి గారు సూపర్ స్టార్ మహేష్ బాబుతో గ్లోబ్ ట్రాట్టింగ్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీని రూపొందించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రూపొందబోతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ మరియు తదితర కీలకపనులు జరుగుతున్నాయి.


రాజమౌళి తండ్రి, ప్రముఖ కథారచయిత విజయేంద్రప్రసాద్ గారు ఈ సినిమాకు కథను అందించబోతున్నారు. ఒక మీడియా వర్గానికి విజయేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం, SSMB 29 కేవలం ఒక సినిమాగా మాత్రమే కాక ఒక ఫ్రాంచైజీగా రాబోతుందని తెలుస్తుంది. అంటే ఈ ప్రాజెక్ట్ పలుభాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న మాట.


ఈ వార్తతో సూపర్ స్టార్ అభిమానుల్లో ఆనందోత్సాహాలు మొదలయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa