ప్రముఖ ఆస్ట్రేలియన్ నటుడు బాబీ డ్రైసెన్(56) మృతిచెందారు. తన నివాసంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. 'యంగ్ టాలెంట్ టైమ్' అనే టీవీ ప్రోగ్రాం ద్వారా బాబీ పాపులారిటీని సంపాదించుకున్నారు. బాబీ మృతిపట్ల సహ నటీనటులు, ఆస్ట్రేలియా సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. యంగ్ టాలెంట్ టైమ్(1979), నెయిబర్(1985), యంగ్ టాలెంట్ టైమ్ టెల్స్ ఆల్(2001) ప్రోగ్రామ్స్ ద్వారా బాబీ మంచి గుర్తింపు పొందారు.