ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైఖేల్ 'నీవుంటే చాలు' మేకింగ్ వీడియో విడుదల

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 02, 2023, 05:14 PM

యంగ్ హీరో సందీప్ కిషన్, 'మజిలీ' ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ జంటగా నటిస్తున్న సినిమా "మైఖేల్". రంజిత్ జయకొడి డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీరోల్ లో నటిస్తున్నారు.


ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ గా 'నీవుంటే చాలు' అనే రొమాంటిక్ మెలోడీ విడుదల కాగా, ఈ పాటకు ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలో నీవుంటే చాలు సాంగ్ మేకింగ్ వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేసారు.


సామ్ CS సంగీతం అందిస్తున్న ఈ సినిమాను  భరత్ చౌదరి, రామ్మోహన్ రావు, నారాయణదాస్ నారంగ్ నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa