ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే ‘జెర్సీ’టీజర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 11, 2019, 01:08 PM

ఇప్పుడు అందరి చూపు న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న స్పోర్ట్ డ్రామా ‘జెర్సీ ‘చిత్రం యొక్క టీజర్ ఫై పడింది. నాని మొదటి సారి గా క్రికెటర్ గా నటిస్తుండడంతోఆ లుక్ లో ఎలా వుంటాడో చూడాలనుకుంటున్నారు. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ను సంక్రాంతి కానుకగా రేపు విడుదలచేయనున్నారు. ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన కన్నడ హీరోయిన్ శ్రద్ద శ్రీనాథ్ నటిస్తుంది.


క్రికెట్ నేపథ్యంలో వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. రంజీ క్రికెటర్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈఏడాది ఏప్రిల్ 19న విడుదలకానుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa