నటసింహం నందమూరి బాలకృష్ణ గారి డిజిటల్ టాక్ షో 'అన్స్టాపబుల్ విత్ NBK సీజన్ 2' లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాల్గొన్న విషయం అందరికి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందిన ఈ ఎపిసోడ్ యొక్క ఫస్ట్ పార్ట్ గత శుక్రవారం స్ట్రీమింగ్ కొచ్చి, డార్లింగ్ అభిమానులకు రెండ్రోజులు ముందుగానే న్యూ ఇయర్ ని తీసుకొచ్చింది.
తాజాగా ఎల్లుండి బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2 స్ట్రీమింగ్ కి రాబోతున్న నేపథ్యంలో కొంతసేపటి క్రితమే ఆహా సంస్థ ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఈసారి ఎపిసోడ్ మరింత ఫన్ గా, కాస్త సీరియస్ గా సాగేలా కనిపిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa