క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా "రంగమార్తాండ". ఈ సినిమాకు ఇళయరాజా గారు సంగీతం అందిస్తుండగా, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, హౌస్ ఫుల్ మూవీస్ సంయుక్త బ్యానర్ లపై కాలేపు మధు, ఎస్ వెంకట్రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ షాయరీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
నిన్నే ఈ సినిమా నుండి ప్రకాష్ గారి ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చెయ్యగా, తాజాగా రమ్యకృష్ణ గారి ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఈ సినిమాలో 'రాజుగారు' పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. సహజంగా రాజుగారు అంటే మగవాళ్ళు పెట్టుకునే పేరు. కానీ ఇక్కడ రమ్యకృష్ణ గారికి రాజుగారు అని పేరు పెట్టడంలో ఆంతర్యమేమిటో.. కృష్ణవంశీ గారికే తెలియాలి. సినిమా విడుదలైన తరవాతగానీ మనం తెలుసుకోలేం.