శ్రీమంగం (ఈ రోజుల్లో ఫేమ్), శశాంక్, అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కు తున్న చిత్రం ప్రణవం. కుమార్.జి. దర్శకత్వం వహిసున్నారు. చరిత అండ్ గౌతమ్ ప్రొడక్షన్స్ పతాకంపై తను.ఎస్. నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణా నంతర పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు కుమార్.జి. మాట్లాడుతూ, చండీఘర్‌కు చెందిన మోడల్ అవంతిక హరి నల్వా హీరోయిన్‌గా నటిస్తోంది. భరతనాట్యం నేపథ్యంలో ప్రేమ, సస్పెన్స్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఆర్.పి.పట్నాయక్, ఉష ఒక డ్యూయెట్‌ను ఆలపించారు. త్వరలో ఆడియో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు. ఈ చిత్రంలో ఇంకా జెమిని సురేష్, నవీన, జబర్దస్త్ బాబి, దొరబాబు, సమీర నటిస్తుం డగా….ఈ చిత్రానికి సంగీతా న్ని పద్మనావ్ భరద్వాజ్, ఛాయాగ్ర హణాన్ని ఎం.డేవిడ్ అందిస్తున్నారు. సహ నిర్మాతలుగా వైశాలి, అనుదీప్ వ్యవహరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa