ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'RAPO20' సెట్స్ లో జాయిన్ అయ్యిన బెంగళూరు బ్యూటీ

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 06, 2023, 05:21 PM

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో పాన్-ఇండియా సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. ఈ పాన్-ఇండియన్ మూవీ టెంపరరీగా 'RAPO 20' పేరుతో అధికారికంగా ప్రారంభించబడింది. ఈ సినిమాలో రామ్ సరసన శ్రీ లీల జోడిగా నటిస్తుంది.


తాజాగా ఇప్పుడు, గ్లామర్ బ్యూటీ శ్రీలీల హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యినట్లు సమాచారం. దర్శకుడు ప్రస్తుతం ప్రధాన జంటతో కూడిన సన్నివేశాలను తెరకెక్కిస్తునట్లు సమాచారం. ఈ చిత్రంలో రామ్ పోతినేని ఫైర్ రోల్‌లో కనిపించనున్నారు అని ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. ఫుల్ మాస్‌ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa