రష్మిక కెరియర్లో 'గీత గోవిందం' చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో ఆమె కుర్రకారు మనసులను దోచేసింది. ఆమె చేసిన ఈ సినిమా 'ఉత్తమనటి'గా 'జీ సినిమా' అవార్డును తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో రష్మిక అభిమానులు ఆమె కోసం ప్రత్యేకంగా ఒక వీడియోను రూపొందించి, ఆమె ఫ్యాన్స్ ట్విట్టర్లో షేర్ చేస్తూ ఆమెకి ట్యాగ్ చేశారు.
'గీత గోవిందం' ఆడియో వేడుక విశేషాలతో .. ఆ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూ బిట్స్ తో .. ఆ సినిమా స్టిల్స్ తో రూపొందించిన ఆ వీడియోను చూసిన రష్మిక తనదైన శైలిలో స్పందించింది. "నేను ఎంతమాత్రం ఊహించలేదు .. ఈ వీడియో చూస్తూ ఏడ్చేశాను .. మీలా ప్రోత్సహించేవారు నా చుట్టూ ఉన్నందుకు నాకెంతో గర్వంగా వుంది. ఆనందంలో కన్నీళ్లు ఆగడం లేదు .. ఐ లవ్ యు సో మచ్ గాయ్స్' అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం రష్మిక తెలుగులో 'డియర్ కామ్రేడ్'తో పాటు కన్నడలో రెండు సినిమాలు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa