రాజుమురుగన్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో కార్తీ తన 25వ సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం చెన్నైలో ప్రారంభమైంది. ఈ సినిమాకి 'జపాన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి త్వరలో మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రానుంది.
ఈ చిత్రంలో కార్తీ సరసన జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుంది. ఈ సినిమాలో టాలీవుడ్ పాపులర్ కమెడియన్ సునీల్ విలన్‌గా నటిస్తున్నట్లు ఫిలిం ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు.