జనవరి 20వ తేదీన 'సినిమా లవర్స్ డే' అన్న విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో 'సినిమా'ను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునేందుకు సినీ లవర్స్ అందరికి పాపులర్ మల్టిప్లెక్స్ చైన్ 'PVR' యాజమాన్యం ఒక ఎక్స్క్లూజివ్ ఆఫర్ తో ముందుకొచ్చింది. ఈ మేరకు జనవరి 20వ తేదీన PVR మల్టీప్లెక్స్ లలో టికెట్ ధర కేవలం '99/-' గా ఉంటుందంటూ యాజమాన్యం అధికారిక ప్రకటన చేసింది. ఈ ఆఫర్ కేవలం ఒక్కరోజు మాత్రమేనని, ప్రీమియం క్యాటగిరీ సీట్స్ కి ఈ ఆఫర్ వర్తించదని పేర్కొంటూ మరికొన్ని షరతులను విధించింది. ఈ నేపథ్యంలో జనవరి 20వ తేదీన విడుదల కాబోయే సినిమాలకు, ఇప్పటికే తెగ హంగామా చేస్తున్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు చాలా మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది.