క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్లో విలక్షణ నటులు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా "రంగమార్తాండ". ఈ సినిమాకు ఇళయరాజా గారు సంగీతం అందిస్తుండగా, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, హౌస్ ఫుల్ మూవీస్ సంస్థల సంయుక్త బ్యానర్ లపై కాలేపు మధు, ఎస్ వెంకట్రెడ్డి నిర్మిస్తున్నారు.
రీసెంట్గానే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన షాయరీ విడుదలై, శ్రోతలను విపరీతంగా మెప్పిస్తుంది. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ ను విడుదల చెయ్యడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఐతే, ముందుగా పాటను కాకుండా, ఆపాట వెనక ఉన్న కథ, సాంకేతికనిపుణులు పడ్డ కష్టం గురించి వివరిస్తూ, డైరెక్టర్ కృష్ణవంశీ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసారు. త్వరలోనే సెకండ్ సింగిల్ రిలీజ్ అప్డేట్ ఇస్తామని పేర్కొన్నారు.