టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గారు హిట్ ఫేమ్ శైలేష్ కొలను డైరెక్షన్లో ఒక మూవీ చెయ్యబోతున్నారని నిన్నటి వరకు సోషల్ మీడియాలో ముమ్మర ప్రచారం జరిగింది. కాసేపటి క్రితమే ఈ విషయం పై అఫీషియల్ క్లారిటీ వచ్చింది. కొలను శైలేష్ డైరెక్షన్లో విక్టరీ వెంకటేష్ గారు తన ల్యాండ్ మార్క్ మూవీ అయినటువంటి 75వ సినిమాను చేస్తున్నారని, ఈ ప్రాజెక్ట్ ను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారని అధికారికంగా తెలుస్తుంది. ఈప్రాజెక్టు ని జనవరి 25వ తేదీన అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో వెంకీ మామ బ్యాక్ యాంగిల్ లో కనిపిస్తున్నారు. బాంబు పేలుడును లెక్క చెయ్యకుండా అటువైపుగా అడుగేస్తున్న వెంకీ ఈ పోస్టర్ లో మనకు కనిపిస్తున్నారు.