టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నుండి రెండేళ్ల విరామం తరవాత రాబోతున్న కొత్త చిత్రం "మైఖేల్". రంజిత్ జెయకొడి డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న మైఖేల్ ఫిబ్రవరి 3వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే మేకర్స్ మైఖేల్ ట్రైలర్ ను విడుదల చెయ్యడం జరిగింది.
ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా మైఖేల్ టీజర్ ఆడియన్స్ లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించిందో, తాజాగా విడుదలైన ట్రైలర్ అంతకు రెట్టింపు ఇంపాక్ట్ ను, ఎక్జయిట్మెంట్ ను ఆడియన్స్ లో కలిగించింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కోసం మైఖేల్ చేసిన శత్రుపోరాటమే ఈ సినిమా. ఈ పోరాటంలో మైఖేల్ కి మిత్రులెవరు ? శత్రువులెవరు? చివరికి ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకున్నాడా? అన్న విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ట్రైలర్ కట్ విధానం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ... ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. యాజూజువల్ సందీప్ కిషన్ తన రోల్ లో జీవించేసారు.
కరణ్ సి ప్రొడక్షన్స్ LLP, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP సంయుక్త బ్యానర్లపై భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మించారు. దివ్యాన్శ కౌశిక్ హీరోయిన్ గా నటించగా, విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, వరుణ్ సందేశ్, వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయ భరద్వాజ్, అయ్యప్ప శర్మ కీరోల్స్ లో నటించారు.