రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా స్పోర్ట్స్ ఎంటర్ప్రెన్యూర్ గా మారినట్టు తెలుస్తుంది. ఈ మేరకు హైదరాబాద్ వాలీబాల్ టీం "బ్లాక్ హాక్స్" కు విజయ్ దేవరకొండ కో ఓనర్ గా వ్యవహరిస్తున్నారని అధికారికంగా తెలుస్తుంది. హైదరాబాద్ వాలీబాల్ టీంతో విజయ్ దేవరకొండ దిగిన పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
త్వరలోనే విజయ్ దేవరకొండ "ఖుషి" మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఆపై గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో మరొక సినిమాను చెయ్యడానికి రెడీ అవుతున్నారు.