మోస్ట్ ప్రెస్టీజియస్ మరియు మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా డిసెంబర్ 16న 160 భాషల్లో ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల ముందుకొచ్చిన అద్భుతమైన విజువల్ వండర్ "అవతార్ 2". ప్రపంచప్రసిద్ధుడైన జేమ్స్ కామెరాన్ డైరెక్షన్లో ఎమోషనల్ యాక్షన్ విజువల్ వండర్ గా రూపొందిన ఈ సినిమా విడుదలై నెల దాటుతున్నా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద ఏమాత్రం తగ్గలేదు.
తాజాగా అవతార్ : ది వే ఆఫ్ వాటర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను రాబట్టిందని తెలుస్తుంది. కామ్ స్కోర్ ప్రకారం, అవతార్ 2 మూవీ నార్త్ అమెరికాలో 602 మిలియన్ డాలర్లను, మొత్తంగా 2.056 బిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. దీంతో డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ ఖాతాలో 2 బిలియన్ కు పైగా కలెక్షన్లు రాబట్టిన సినిమాల సంఖ్య మూడుకు చేరుకున్నాయి.
![]() |
![]() |