నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి వరుణ్ తేజ్ తో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపద్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను అల్లు అర్జున్ సొంత అన్న బాబీ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు. మార్చి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో తమిళ నటుడు అర్జున్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. నాపేరు సూర్య సినిమాలో బన్నీ ఫాదర్ పాత్రలో నటించిన అర్జున్ ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో నటించే హీరోయిన్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఎఫ్ 2 సినిమాతో విజయాన్ని అందుకున్న వరుణ్ తేజ్ మరింత జోష్ తో సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. హరీష్ శంకర్ తో ఒక సినిమా సాగర్ చంద్ర దర్శకత్వంలో మరో సినిమాలో నటించబోతున్నాడు వరుణ్ తేజ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa