హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తన కుమారుడు ఆకాశ్ పూరీతో సినిమా తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేశారు. ఈ సినిమాకు ‘మెహబూబా’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఫస్ట్‌లుక్‌లో విమానాలు, రైలు బొమ్మ మధ్య పాకిస్థాన్ అని ఉండడంసినిమాపై ఆసక్తి రేపుతోంది. 1971 భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ఈ రొమాంటిక్ ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఆకాశ్‌కు జోడీగా మంగళూరుకు చెందిన నేహాశెట్టిని ఎంపిక చేసుకున్నారు. పూరీ కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నటి ఛార్మి ప్రొడక్షన్ బాధ్యతల్ని చూసుకొంటున్నారు.
‘నా ఆలోచనలకు భిన్నమైన కథ ఇది. ఆకాశ్‌కి సినిమాలపై ఆసక్తి ఉండడంతో నేను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. సందీప్ చౌతా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. అక్టోబర్‌లో హిమాచల్ ప్రదేశ్‌లో చిత్రీకరణ జరుపుతున్నాం. ఆ తర్వాత పంజాబ్, రాజస్థాన్‌లోనిఅందమైన ప్రదేశాల్లో మిగతా షెడ్యూల్ పూర్తి చేస్తాం.’ అని పూరీ ట్విటర్‌లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa