టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ తన ల్యాండ్ మార్క్ మూవీ 75వ సినిమా "సైOధవ్" ను హిట్ ఫేమ్ శైలేష్ కొలను డైరెక్షన్లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నిన్ననే స్పెషల్ గ్లిమ్స్ విడుదల చేసి, అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసిన చిత్రబృందం తాజాగా మరొక మేజర్ అప్డేట్ ఇచ్చింది. బాలీవుడ్ విలక్షణ నటుడు, భారతదేశం గర్వించదగ్గ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ సైOధవ్ లో కీరోల్ లో నటిస్తున్నట్టు అఫీషియల్ పోస్టర్ తో పేర్కొన్నారు.
నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో తెరకెక్కుతుంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. పోతే, ఈ రోజే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది.