కాసేపటి క్రితమే సత్యదేవ్ 26 మూవీ టైటిల్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది. సత్యదేవ్ కెరీర్ లో 26 వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు "జీబ్రా" అనే ఆసక్తికరమైన మరియు యూనిక్ టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చెయ్యడం జరిగింది. ఈమేరకు విడుదలైన టైటిల్ పోస్టర్ లో చదరంగంలో ఉండే రెండు రంగుల గుర్రపు బొమ్మలు, వాటిపై ఎగురుతున్న విమానం, ఆ మధ్యలో ఎగురుతున్న నోటు కాగితం.. కనిపిస్తున్నాయి. ధైర్యానికి అదృష్టం ఎల్లప్పుడూ అనుకూలంగా ఉంటుంది..అనే క్యాప్షన్ తో విడుదలైన ఈ పోస్టర్ ఇంట్రిగ్యుయింగ్ గా ఉంది.
ఈ సినిమాలో కన్నడ నటుడు దాలి ధనంజయ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రియాభావని శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిలిమ్స్ సంయుక్త బ్యానర్ లపై Sn రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ హీరో సత్యరాజ్ కీలకపాత్రలో నటిస్తున్నారు.పోతే, పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది.