అజిత్ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో రూపొందిన 'విశ్వాసం' .. ఈ నెల 10వ తేదీన తమిళనాట భారీస్థాయిలో విడుదలైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తమిళనాట రజనీకాంత్ 'పేట'తో పోటీపడుతూ ఈ సినిమా దూసుకుపోతోంది.పండుగ సందర్భంగా అజిత్ సినిమా హిట్ కావడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమిళంలో విడుదలైన రోజునే తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇక్కడ పోటీ ఎక్కువగా ఉండటంతో .. థియేటర్ల సమస్య తలెత్తుతుందని ఆగారు. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఫిబ్రవరి 1వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారనేది తాజా సమాచారం. అజిత్ హీరోయిజం .. జగపతిబాబు విలనిజం తెరపై చూసి తీరవలసిందేనని అంటున్నారు. తెలుగులో ఈ సినిమా ఏ స్థాయిలో సందడి చేస్తుందో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa