ఎంతో కూల్ గా కనిపించే బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రణ్ బీర్ కపూర్ ఒక అభిమాని ఫోన్ విసిరిగొట్టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అభిమాన నటుడితో సెల్ఫీ దిగుదామని ఎంతో ఆశగా వచ్చిన సదరు అభిమాని ఫోన్ ని విసిరిగొట్టి తన యారగంట్ యాటిట్యుట్ చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. దీంతో రణ్ బీర్ ను అభిమానించే వాళ్ళు కూడా ఒకింత అసహనం వ్యక్తం చేసారు.
ఐతే, తాజాగా ఈ వార్తపై అసలు నిజం బయటకొచ్చింది. వైరల్ ఐన వీడియోలో సగం కంటెంట్ మాత్రమే ఉందని తెలుస్తుంది. అసలు విషయమేంటంటే, ఒప్పో రెనో మొబైల్ యాడ్ షూట్ లో భాగంగా ఈ వీడియోను చిత్రీకరించగా, మేకర్స్ సగం వీడియోను వైరల్ చేసి, ఆడియన్స్ లో ఫుల్ బజ్ క్రియేట్ చేసి, తాజాగా ఈ రోజు ఫుల్ వీడియోను విడుదల చేసారు. ఫుల్ వీడియోలో ఏముంటుందంటే, ఫోన్ విసిరికొట్టిన రణ్ బీర్ వెంటనే ఆ అభిమానికి ఒప్పో రెనో న్యూ మొబైల్ ని ఇచ్చి, సెల్ఫీ దిగుతారు.