నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'దసరా'. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా మేకర్స్ నుండి టీజర్ లాంచ్ డీటెయిల్స్ కి సంబంధించి ఒక స్పెషల్ వీడియో విడుదలైంది. ఈ మేరకు దసరా టీజర్ ను తమిళంలో ధనుష్, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్, హిందీలో షాహిద్ కపూర్ విడుదల చెయ్యనున్నారని తెలుస్తుంది.
దసరా టీజర్ ఈ నెల 30వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మార్చి 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది.