గుండెపోటుకు గురై చికిత్స పొందుతున్న తారకరత్నకు అత్యంత అరుదైన మెలేనా వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధి జీర్ణాశయం లోపల రక్తస్రావానికి సంబంధించినది. దీనివల్ల నోరు, అన్నవాహిక, పొట్ట భాగంలో బ్లీడింగ్ అవుతుంది. శరీరంలో రక్తస్థాయిలు తగ్గిపోయి బలహీనంగా మారిపోయి, క్రమంగా అనిమియాకు దారితీస్తుంది. శరీరం రంగు మారడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు తెలిపారు.