బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో వచ్చిన పఠాన్ చిత్రం రికార్డులు సృష్టిస్తుంది. షారుక్, దీపికా, జాన్ అబ్రహాం నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రం 3 రోజుల్లోనే రూ.313 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. భారత్ లో రూ.201 కోట్లు, విదేశాల్లో రూ.112 కోట్లు వసూలు చేసింది. వేగంగా రూ.300 కోట్ల క్లబ్ లో చేరిన తొలి హిందీ సినిమాగా నిలిచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.