నాచురల్ స్టార్ నాని, మృణాళ్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యువ్ ఒక ఫీల్ గుడ్ మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. నాని కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేస్తూ విడుదల చేసిన క్యూట్ వీడియోకు ఆడియన్స్ నుండి హార్ట్ వార్మింగ్ రెస్పాన్స్ వచ్చింది.
నాని 29వ సినిమా దసరా షూటింగ్ ముగియడంతో ఇప్పుడు ఈ సినిమా పట్టాలెక్కేందుకు సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో జనవరి 31వ తేదీ ఉదయం 10:45నిమిషాలకు నాని 30 మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కాబోతుందని కాసేపటి క్రితమే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది.
వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ వన్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.