పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ వరస క్రేజీ ప్రాజెక్ట్స్ ఫుల బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే వంటి భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తున్న ప్రభాస్ లిస్ట్ లో డైరెక్టర్ మారుతి సినిమా కూడా ఉంది.
తాజాగా మారుతి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక కార్ డ్రైవింగ్ వీడియో ఫుల్ వైరల్ గా మారింది. ప్రభాస్ దగ్గరున్న లేటెస్ట్ మోడల్ ఖరీదైన లంబోర్గిని కార్ డ్రైవ్ చేస్తున్న వీడియోను మారుతి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసారు. కొద్దిక్షణాల్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా, ఈ చిత్ర వివరాలపై అఫీషియల్ క్లారిటీ రావలసి ఉంది.