సౌత్ క్వీన్ త్రిష ముఖ్యపాత్రలో నటించిన చిత్రం "రాంగి". ప్రముఖ దర్శకుడు AR మురుగదాస్ ఈ సినిమాకు కథను అందించారు. M శరవణన్ దర్శకత్వం వహించారు. C సత్య సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 30న విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఈ విషయం పక్కన పెడితే, ఈ రోజు నుండే రాంగి డిజిటల్ ఆడియన్స్ ను అలరించేందుకు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడే, చిన్న ట్విస్ట్ ఉంది. తమిళంలో థియటర్లలో విడుదలైన ఈ సినిమా తెలుగులో 'రిపోర్టర్' పేరుతో డైరెక్ట్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చి, టాలీవుడ్ ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలలో నెట్ ఫ్లిక్స్ లో రాంగి / రిపోర్టర్ స్ట్రీమింగ్ అవుతుంది.