అమెరికన్ నటి అన్నీ వెర్షింగ్(45) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె లాస్ ఏంజిల్స్‌లో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అన్నీ వెర్షింగ్ 24 సిరీస్ లో రెనీ వాకర్ గా నటించి పాపులర్ అయ్యారు. బోష్, టైమ్‌లెస్ వంటి అనేక అమెరికన్ టీవీ సిరీసుల్లో ఆమె నటించారు. ఆమె నాటీ డాగ్ యొక్క వీడియో గేమ్ 'ది లాస్ట్ ఆఫ్ అస్' లో టెస్ పాత్ర కోసం మోషన్-క్యాప్చర్, వాయిస్ వర్క్ కూడా చేశారు.