నాలుగేళ్ళ విరామం తదుపరి "పఠాన్" తో ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కి థియేటర్లలో ఘనస్వాగతం లభిస్తుంది. జనవరి 25 నాన్ హాలిడే రోజున హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదలైన పఠాన్ ఆడియన్స్ నుండి ఊరమాస్ రెస్పాన్స్ అందుకుంటుంది. ‘పఠాన్’ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. విడుదలైన 4 రోజుల్లోనే శనివారం వరకూ రూ.429 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ తెలిపారు. ఆదివారంతో రూ.500 కోట్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుక్ వెండితెరపై సందడి చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.