పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న ప్రాజెక్ట్ 'OG'. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నేడు గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. చిత్రబృందం అన్నపూర్ణ స్టూడీయోస్‌లో ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి పవన్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. షూటింగ్ త్వరగా పూర్తిచేసి ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మేకర్స్ ఇప్పటి వరకు నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల గురించి ఎటువంటి వివరాలను ప్రకటించలేదు. ఈ ప్రాజెక్ట్‌ను డివివి దానయ్య తన హోమ్ బ్యానర్ డివివి ఎంటర్టైన్‌మెంట్‌పై భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. షూటింగ్ మరియు ఇతర వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి. వీరి కాంబినషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.