యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన పాన్ ఇండియా మూవీ 'మైఖేల్'. ఈ చిత్రం ఫిబ్రవరి 3న పలు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రేపు హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా రానున్నారు. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది. రేపు హైదరాబాద్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం 6 గంటల నుండి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది అని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనసూయ భరద్వాజ్ మరియు ఇతరులు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు.