నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్-2 కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ రెండు పార్టులుగా స్ట్రీమింగ్ అవ్వనుండగా, మొదటి పార్ట్ ను ఫిబ్రవరి 3న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 'మాటల్లో రోషం, మీసంలో పౌరుషం, ఆ కటౌట్ లో రాజసం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ అప్పియరెన్స్ కి ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది' అని ఆహా ట్వీట్ చేసింది.