నందమూరి కళ్యాణ్ రామ్ త్రిబుల్ రోల్ లో కనిపించబోతున్న సినిమా "అమిగోస్". రాజేంద్ర రెడ్డి డైరెక్షన్లో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి రెడీ అయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 5వ తారీఖు అంటే రేపు సాయంత్రం ఐదు గంటల నుండి హైదరాబాద్ JRC కన్వెన్షన్స్ లో అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని, ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు హాజరు కాబోతున్నారని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన "బింబిసార" ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరైన విషయం తెలిసిందే. గతేడాది విడుదలైన బింబిసార కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ తో అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తారక్ చీఫ్ గెస్ట్ రాబోతుండడంతో ఈ సినిమా కూడా బిగ్ కమర్షియల్ సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.