కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందుతున్న చిత్రం "లియో". నిన్న సాయంత్రమే ఈ మూవీ యొక్క టైటిల్ రివీల్ ప్రోమో విడుదలైంది. ఈ వీడియోలో విజయ్ రెండు విభిన్న కోణాలలో కనిపిస్తున్నారు. ఒకటి - పక్కా ఫ్యామిలీ మ్యాన్ గా..రెండు - క్రూయల్ గ్యాంగ్స్టర్ గా. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో మంచి హైప్ ఉండగా, నిన్న విడుదలైన ప్రోమోలో తలపతిని ఇంటెన్స్ లుక్ లో చూసేసరికి అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఈ ప్రోమోకి 15 మిలియన్ కి పైగా రియల్ టైం వ్యూస్, 1.2 మిలియన్ లైక్స్ తోటి ఆడియన్స్ నుండి ఎనర్మాస్ రెస్పాన్స్ అందుతుంది.