పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో "హరిహర వీరమల్లు" బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్న దిగ్గజ నిర్మాత AM రత్నం గారి పుట్టినరోజు ఈ రోజు. దీంతో హరి హర వీరమల్లు చిత్రబృందం రత్నం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తూ, సెట్స్ నుండి కొన్ని పిక్స్ విడుదల చేసారు.
AM రత్నం గారు నెల్లూరు జిల్లాలో జన్మించారు. నిర్మాతగానే కాక దర్శకుడిగా, లిరిసిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారి "కర్తవ్యం" తో సినీనిర్మాణ రంగంలో అడుగుపెట్టిన AM రత్నం గారు ఆపై ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించారు. పెద్దరికం, ఇండియన్, ఖుషి, 7జి బృందావన్ కాలనీ, శివకాశి, వేదాళం, ఆరంభం.. ఇంకా ఎన్నో కల్ట్ క్లాసిక్ మూవీస్ రత్నం గారి నిర్మాణ సారధ్యంలో రూపొందినవి.