ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడుదల తేదీని లాక్ చేసిన కన్నడ సూపర్‌స్టార్‌ ల్యాండ్‌మార్క్‌ చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 04, 2023, 06:22 PM

ఎ హర్ష దర్శకత్వంలో కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్‌ నటించిన తన 125వ చిత్రం తెలుగులో విడుదల కానుంది. ఈ బిగ్గీ డిసెంబర్ 2022లో కన్నడలో విడుదలైంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క తెలుగు-డబ్బింగ్ వెర్షన్ ని 'వేధా' టైటిల్ తో ఫిబ్రవరి 9, 2023న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ తెలుగులో ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను విడుదల చేస్తోంది.


ఈ మైల్‌స్టోన్ మూవీలో ఘనవి లక్ష్మణ్, ఉమాశ్రీ, అదితి సాగర్, శ్వేత చెంగప్ప తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గీతా పిక్చర్స్ మరియు జీ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి అర్జున్ జన్య సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa