మాస్ రాజా రవితేజ నటించిన కొత్త చిత్రం "ధమాకా". కొంతసేపటి క్రితమే ఈ సినిమా నుండి 'డూ డూ' ఫుల్ వీడియో సాంగ్ రిలీజయ్యింది. మాస్ రాజా అభిమానులు పండగ చేసుకునే పాట ఇది. భీమ్స్ అందించిన పెప్పీ ట్యూన్ కి, శేఖర్ మాస్టర్ అద్దిరిపోయే కొరియోగ్రఫీతోడు కావడం, మాస్ రాజా మాస్సివ్ ప్రెజెన్స్ తో ఈ పాట లిరికల్ వీడియోకి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. పోతే ఈ పాటను సింగర్ పృథ్విచంద్ర ఆలపించగా, రామజోగయ్యశాస్త్రి గారు లిరిక్స్ అందించారు.
నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో ఔటండౌట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa