దర్శకుడు, నటుడు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి". కాసేపటి క్రితమే టీజర్ విడుదలయ్యింది. పర్ఫెక్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 17న విడుదల కాబోతుంది.
శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మిస్తున్నారు.