బాలీవుడ్ నటి కాజోల్ ఇటీవల రేవతి దర్శకత్వం వహించిన 'సలామ్ వెంకీ' చిత్రంలో కనిపించింది. ఈ డ్రామా డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే రుగ్మత ఉన్న యువ చెస్ ప్లేయర్ గురించి. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు. తాజగా ఇప్పుడు ఫిబ్రవరి 10 నుండి ZEE5లో ఈ సినిమా డిజిటల్ ప్రసారానికి అందుబాటులోకి రానుంది.
విశాల్ జెత్వా టైటిల్ రోల్ పోషించాడు. ఈ సినిమాలో రాహుల్ బోస్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, అనంత్ మహదేవన్, అహనా కుమ్రా ముఖ్య పాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఈ చిత్రంలో అతిధి పాత్రలో నటించారు.