చూసిన ప్రతి ఒక్కరి మనసును గెలుచుకుంటున్న రైటర్ పద్మభూషణ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను నమోదు చేస్తున్నాడు. ఇరు తెలుగు రాష్ట్రాల మహిళలకు నిన్న ఫ్రీ షోలు నిర్వహించగా, అది బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో రోజురోజుకూ రైటర్ బాక్సాఫీస్ వద్ద మరింత బలంగా తయారవుతున్నాడు. ఈ నేపథ్యంలో విడుదలైన ఆరు రోజులలో రైటర్ వరల్డ్ వైడ్ గా 7.29 కోట్లను వసూలు చేసాడు. ఈ మేరకు మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడింది.
ప్రశాంత్ షణ్ముఖ్ దర్శకత్వంలో సుహాస్, టీనా శిల్పారాజ్ జంటగా నటించిన ఈ సినిమాలో రోహిణి, ఆశిష్ విద్యార్ధి కీరోల్స్ లో నటించారు.