ఇండియన్ సినిమా హిస్టరీలో 20 సంవత్సరాల పాటు ఏకధాటిగా రన్ ఐన ఒకేఒక సినిమా "దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే". మరాఠా మందిర్ లో ఈ సినిమా 20 ఏళ్లపాటు నడిచింది.
ఆదిత్య చోప్రా డైరెక్టర్ గా పరిచయమైన ఈ సినిమాలో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటించారు. అమరిష్ పూరి, అనుపమ్ ఖేర్ కీలకపాత్రలు పోషించారు. యష్ చోప్రా నిర్మించిన ఈ సినిమా 1995 అక్టోబర్ 20వ తేదీన విడుదలై ఇండియన్ సినిమాలో పెను సంచలనమే సృష్టించింది.
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా మరోసారి థియేటర్లకు రాబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. రేపటి నుండి వారం రోజుల పాటు, కేవలం 37 ఎంపిక చెయ్యబడిన నగరాలలో మాత్రమే ఈ సినిమా ప్రదర్శన కాబోతుంది.