విడుదలకు ముందు ఫ్యామిలీ స్క్రీనింగ్స్, బడ్జెట్ టికెట్ రేట్లు .. అంటూ ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాస్ప్ చేసిన "రైటర్ పద్మభూషణ్" చిత్రబృందం చిత్ర విడుదల తరవాత కూడా ముమ్మర ప్రచారం చేస్తూ, వీలైనంత ఎక్కువగా ఈ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద రైటర్ రోజురోజుకూ బలంగా మారుతున్నాడు. సూపర్ పాజిటివ్ మౌత్ టాక్ తో USA బాక్సాఫీస్ వద్ద కూడా రైటర్ విజృంభిస్తున్నాడు. తాజాగా రైటర్ వసూళ్లు 300కే డాలర్ మార్క్ ను క్రాస్ చేసి, 500కే మార్క్ చేరుకోవడానికి పరుగు పెడుతున్నాయి.