నిన్న సాయంత్రం విడుదలైన టీజర్ తో ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షించిన "బెదురులంక 2012" మూవీ మార్చి 22 వ తేదీన విడుదల కావడానికి సిద్ధమవుతుందని టాక్. అతి త్వరలోనే మేకర్స్ నుండి విడుదల తేదీపై అఫీషియల్ క్లారిటీ రాబోతుందంట.
క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ, నేహశెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమా డ్రామెడి జోనర్ లో తెరకెక్కింది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై బెన్ని ముప్పనేని నిర్మిస్తున్నారు.