నటుల నుండి దర్శకులుగా, కొరియోగ్రాఫర్ల నుండి దర్శకులుగా మారినవారు ఎంతోమంది టాలీవుడ్ లో ఉన్నారు. కొరియోగ్రాఫర్ల నుండి మెగాఫోన్ పట్టిన వారిలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, లారెన్స్, అమ్మ రాజశేఖర్, బృందా మాస్టర్ పేర్లు ప్రధానంగా చెప్పుకోవచ్చు. తాజాగా ఈ లిస్టులోకి టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్ కూడా జాయిన్ కాబోతున్నారని ఇండస్ట్రీ టాక్.
ఇప్పటికే శేఖర్ మాస్టర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుందట కూడా. ఐతే, ఈ విషయాన్నీ శేఖర్ మాస్టర్ సీక్రెట్ గా ఉంచుతున్నారట కారణం... రషెష్ చూసి నచ్చిన తరవాతే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇద్దామని ఆతృతగా ఎదురుచూస్తున్నారట.
ఒకపక్క స్టార్ సెలెబ్రెటీలకు సాంగ్స్ కంపోజ్ చేస్తూ, మరోపక్క బుల్లితెరపై డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా ఉన్న శేఖర్ మాస్టర్ నిజంగానే మెగా ఫోన్ పట్టారా..? అని ఆడియన్స్ ఒకింత ఆశ్చర్యపోతున్నారు. మరి, ఈ విషయంపై నిజానిజాలు తెలియాల్సి ఉంది.