ఈ ఏడాదిలో బాలీవుడ్ సెలెబ్రిటీలు వరసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇండియన్ క్రికెటర్ KL రాహుల్ - బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టిల వివాహం జనవరి 23న జరగ్గా, క్రేజీ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీల వివాహం ఈ నెల 7వ తేదీన రాజస్థాన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో మరొక సెలబ్రిటీ దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది.
ఖుదా హఫీజ్ ఫేమ్ హీరోయిన్ శివలీక ఒబెరాయ్, దర్శకుడు అభిషేక్ పాఠక్ ని ఫిబ్రవరి 9వ తేదీన వివాహమాడింది. వివాహ ఫోటోలను ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేసి, అభిమానుల ఆశీర్వాదం కోరుకుంది. అభిషేక్ పాఠక్ డైరెక్ట్ చేసిన దృశ్యం 2 గతేడాది విడుదలై బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.