ఈ రోజు హైదరాబాద్ నగరం గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే, వరల్డ్ రికగ్నిషన్ పొందిన ఫార్ములా ఈ రేస్ ఈ ఏడాది హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా పోటీలు జరుగుతున్నప్పుడు రామ్ చరణ్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, యష్, దుల్కర్ సల్మాన్ ఇంకా పలువురు సినీ సెలెబ్రిటీలు హాజరయ్యారు. సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ వంటి పలువురు క్రీడాదిగ్గజాలు కూడా పాల్గొన్నారు.
పోటీల గురించి పక్కన పెడితే, ఈ ఈవెంట్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మహీంద్రా అండ్ మహీంద్రా వ్యవస్థాపకుడు ఆనంద్ మహీంద్రాకు నాటు నాటు స్టెప్పులు నేర్పించడం హైలైట్ గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa